బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేసి చరిత్రను పునరుద్ధరిస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర

రిపోర్టర్: హరి స్థలం: కృష్ణా

బందరు పోర్టు నిర్మాణాన్ని పట్టుదలగా పూర్తి చేసి మచిలీపట్నం కీర్తి ప్రతిష్టలను, చారిత్రక వైభవాన్ని మళ్లీ పునరుద్ధరిస్తామని గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. తీర ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. మచిలీపట్నం ప్రాంతాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకురావడానికి చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.