ఆసియా క్రీడల్లో భారత బృందానికి వసతి ఇబ్బందులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: జపాన్
జపాన్ వేదికగా జరగనున్న ఐచి-నగోయా ఆసియా క్రీడల్లో భారత బృందానికి వసతి కొరత వేధిస్తోందని భారత చెఫ్ డి మిషన్ సహ్‌దేవ్ యాదవ్ వెల్లడించారు. జపాన్ చేరుకున్నాక తమ వసతి కోటాను తగ్గించడంతో ప్రత్యామ్నాయంగా అదనపు హోటల్ గదులను బుక్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అథ్లెట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తో కలిసి సొంతంగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.