రన్వేపై విమానం కదులుతుండగా నిలబడ్డ ప్రయాణికులు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ స్పందన

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రన్వేపై కదులుతుండగా ప్రయాణికులు తమ సీట్లలో నుంచి లేచి నిలబడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. విమాన ప్రయాణికుడు అమితాబ్ దాస్ ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ ఎయిర్లైన్స్ భద్రతా ప్రమాణాలను ప్రశ్నించారు. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ ప్రయాణికుల భద్రత తమ ప్రథమ ప్రాధాన్యత అని, అన్ని నిబంధనల ప్రకారమే విమాన సర్వీసులు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది.