ఘనంగా గ్లోబల్ ఎన్నారై టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
రిపోర్టర్: హరి
స్థలం: మంగళగిరి
మంగళగిరిలోని ఎన్టీఆర్ భవనంలో గ్లోబల్ ఎన్నారై టీడీపీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. 45 మందితో కూడిన నూతన కార్యవర్గంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణం చేయించారు. గ్లోబల్ ఎన్నారై టీడీపీ అధ్యక్షుడిగా డా. పిల్ గురురాజా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్, విశిష్ట అతిథిగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు.