దేశంలోనే తొలిసారిగా ఏపీలో త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల నిర్మాణం
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతను తీసుకురాబోతున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణశాఖ అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో ప్రయోగాత్మకంగా వంద ఇళ్లను సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్మించనుందని తెలిపారు. అక్టోబర్ నాలుగో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, సీబీఆర్ఐ మధ్య దీనికి సంబంధించి కీలక ఒప్పందం కుదురుతుందని అధికారులు స్పష్టం చేశారు.