హైదరాబాద్ లో రాగల రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాగల రెండు రోజులు హైదరాబాద్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. సోమవారం మల్కాజిగిరిలో 1.20 సెంటీమీటర్లు, గండిమైసమ్మలో 2.5 మిీటర్ల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్‌ అధికారులు తెలిపారు. మరోవైపు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 32.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.9 డిగ్రీలుగా నమోదైంది.