ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన గుడిపూడి జగదీష్

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరంలోని 44వ డివిజన్లో అనారోగ్యంతో బాధపడుతున్న సరాబు అనంతరామారావు కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు గుడిపూడి జగదీష్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు రూ.60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండటమే ప్రజా సేవ అని జగదీష్ పేర్కొన్నారు. ఈ నిధుల మంజూరుకు సహకరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మైనారిటీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.