టూత్‌పేస్ట్ ట్యూబ్‌లపై రంగు గుర్తుల అసలు రహస్యం ఏమిటి
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
టూత్‌పేస్ట్ ట్యూబ్‌ల అడుగున ఉండే రంగు మార్కులకు అందులో ఉండే పదార్ధాలతో ఎలాంటి సంబంధం లేదని డాక్టర్ జాకిర్ ఐజాజ్ స్పష్టం చేశారు. ఆటోమేటిక్ యంత్రాలు ప్యాకింగ్ చేసే సమయంలో ట్యూబ్‌ను కట్ చేయడానికి, ఫోల్డ్ చేయడానికి లేదా సీల్ చేయడానికి సెన్సార్ల సహాయం కోసం మాత్రమే ఈ రంగు గుర్తులను ఉపయోగిస్తాయని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అపోహలను వినియోగదారులు నమ్మవద్దని ఆయన సూచించారు.