భక్తిపారవశ్యంతో పులకించిన వాడపల్లి విశ్వేశ్వర స్వామి ఆలయం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కొత్తపేట
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో గణపతి పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. పండుగ వేళ విశ్వేశ్వర స్వామి వారిని, విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.