భారీవర్షాలపై సమీక్ష నిర్వహించి అధికారులను అప్రమత్తం చేసిన పవన్ కళ్యాణ్
రిపోర్టర్: అశోక్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లాలో కురుస్తున్న భారీవర్షాలు మరియు వరద పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించారు. సహాయక చర్యలను ముమ్మరం చేసి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.