ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సంగారెడ్డిలో కాంగ్రెస్ మహా నిరసన ర్యాలీ

రిపోర్టర్: md khaleel స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లాలో దేశవ్యాప్త ఓటు హక్కు పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఐలమ్మ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ప్రదర్శనలో మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి సహా ఇండియా కూటమి నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకై తమ గళాన్ని గట్టిగా వినిపించారు.