జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలని బీఎల్ఎఫ్ డిమాండ్
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జనగణనలో బీసీ కాలమ్ను చేర్చాలని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ సంకె రవి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మూడు డిక్లరేషన్లను వెంటనే అమలు చేయాలని కోరారు. నవంబర్ మొదటి తేదీన నిర్వహించనున్న రౌండ్టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.