సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తిరుపతి
సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పొదలకూరు పట్టణంలో పీఎంకేకేవై నిధులతో నూతనంగా నిర్మించిన భోజనశాలలను ఆయన ప్రారంభించారు. వివిధ పథకాల ద్వారా పాఠశాలలకు నిధులు సమకూర్చి, విద్యార్థులకు మెరుగైన వసతులు, ప్రయోగశాలలు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.