భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ సాహసానికి బీజేపీ తెలంగాణ ప్రశంసలు

రిపోర్టర్: మహేష్ స్థలం: Telangana

విధి నిర్వహణలో వందలాది మంది ప్రాణాలను కాపాడేందుకు భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ చూపించిన అత్యంత సాహసోపేత పోరాటం ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తిని మరింత పెంచిందని బీజేపీ తెలంగాణ అధికారిక ఖాతాలో కొనియాడారు. ప్రాణాలకంటే కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడమే ముఖ్యమనే భారతీయత సూత్రానికి ఈ సాహస కృత్యం నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సాహసోపేత విధి నిర్వహణ దేశ ప్రతిష్టను చాటిచెప్పడమే కాకుండా ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతోందని తెలిపారు.