ఈసారి చలికాలంలో పెరుగుదల: సాధారణం కంటే అధికంగానే ఉష్ణోగ్రతలు
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
రాబోయే మూడు నెలల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉండే శీతాకాలంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్నినో పరిస్థితులు దీనికి కారణమని అధికారులు తెలిపారు. ఈసారి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికి మించి ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.