షెహజాద్ భట్టీ నెట్ వర్క్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కేంద్రం
రిపోర్టర్: మహేష్
స్థలం: New Delhi
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ చెందిన కుఖ్యాత్ షెహజాద్ భట్టీ నెట్ వర్క్ ను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ సంస్థ సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాతో పాటు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.