వెంకటాచలంలో భారీ బందోబస్తు.. సుందరీకరణ పనుల్లో నిమగ్నం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రానున్న ఏడో తేదీన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాక నేపథ్యంలో, అధికారులు పారిశుద్ధ్య పనులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
స్థానిక స్వర్ణ భారతి స్కూల్, అక్షర విద్యాలయాల ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటనకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా, అన్ని శాఖల సమన్వయంతో పనులు వేగవంతం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.