నరుల సేవయే నారాయణ సేవ: జహీరాబాద్ ఆసుపత్రిలో రోగులకు ఉచిత అన్నదానం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జహీరాబాద్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సఫర్ బైతుల్ మాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఇన్ఛార్జి వైద్యులు డాక్టర్ మల్లికార్జున స్వామి పాల్గొని మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద రోగులకు, వారి సహాయకులకు ఉచిత భోజనాలు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు విశేషంగా పాల్గొన్నారు.