ములుగు జిల్లాలో గణేష్ నిమజ్జనానికి డీజేల అనుమతి లేదు
రిపోర్టర్: రాము
స్థలం: ములుగు
ములుగు జిల్లాలో ఈనెల 23న జరగనున్న గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ తెలిపారు. నిమజ్జన ఊరేగింపులో డీజేలకు పూర్తిగా అనుమతి లేదని స్పష్టం చేశారు. హైటెన్షన్ వైర్లకు తగలకుండా పోలీసు సిబ్బంది సూచించిన మార్గాల్లోనే విగ్రహాలను తరలించాలని, మైక్ ల అనుమతి కోసం ఆయా సబ్ డివిజన్ల అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.