విద్యార్థులకు అలర్ట్: ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి. రంజిత్ బాషా వెల్లడించారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయని, ఇది ప్రస్తుతం తాత్కాలిక షెడ్యూల్ మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా సవివరమైన టైమ్టేబుల్ను పరిశీలించి పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు.