వేములవాడలో ఘనంగా కోట్లాది రూపాయల సీసీ రోడ్ల ప్రారంభోత్సవం

రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్ స్థలం: కాకినాడ రూరల్

కరప మండలం వేములవాడ పంచాయతీ పరిధిలోని సిరిగలపల్లి లంకలో రూ.38 లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్లను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు ప్రారంభించారు. గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన రహదారుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వారు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని వారు స్పష్టం చేశారు.