తూర్పుగోదావరి జిల్లాలో కలకలం: గౌరీపట్నం క్వారీ ప్రాంతంలో పెద్దపులి సంచారం
రిపోర్టర్: రాము
స్థలం: తూర్పుగోదావరి
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం సమీపంలో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు. మేరీమాత ఆలయం వెనుక ఉన్న క్వారీ ప్రాంతంలో నక్కిన పులిని పట్టుకునేందుకు అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పులి మెడలోని జీపీఎస్ ట్రాకర్ సహాయంతో కదలికలను గమనిస్తూ మత్తు ఇంజెక్షన్లతో సురక్షితంగా బంధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు.