అర్నబ్ తుఫాన్ బీభత్సం: రాష్ట్రంలో నాలుగు వేల కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించిన సీఎం

రిపోర్టర్: విజయ్ స్థలం: Dr. B.R. Ambedkar Konaseema

అర్నబ్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో సుమారు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కోనసీమ జిల్లాలో ఆయన పర్యటించి నీట మునిగిన పంట పొలాలు, దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. తుఫాన్ నష్టంపై కేంద్ర హోంమంత్రితో మాట్లాడామని, త్వరలో కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటిస్తాయని తెలిపారు.