విజయనగరంలో వైభవంగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవ ఏర్పాట్లు పూర్తి
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయనగరం
విజయనగరం నగరంలోని పెద్ద చెరువులో పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ ఈవో శిరీష మరియు ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. సోమవారం సాయంత్రం వేడుకల కోసం ప్రత్యేకంగా రూపొందించిన హంస ఆకారపు తెప్పపై ట్రయిల్ రన్ నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తెప్ప వద్దకు తీసుకొచ్చి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.