యువతను ఆకట్టుకునేలా హై సినిమా నుండి దమ్ములుంటే పాట విడుదల
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పనిచేసిన ఎస్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై చిత్రంలోని దమ్ములుంటే ప్రమోషనల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. క్రికెట్ నేపథ్యంతో సాగే ఈ యూత్‌ఫుల్ పాటలో ప్రధాన తారాగణమంతా సందడి చేసింది. రోల్ రైడా ర్యాప్, వికాస్ బదిసా సంగీతం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా భావోద్వేగాలతో ఆకట్టుకోనుంది.