ఏపీలో భారీ వర్షాలు, వైఎస్సార్సీపీలో కీలక మార్పులు
రిపోర్టర్: సునీల్
స్థలం: ఆంధ్రప్రదేశ్
విజయనగరం వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నియమితులయ్యారు. అల్లూరి జిల్లా రాజవొమ్మంగిలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. తిరుమలలో భారీ వర్షం కురుస్తుండగా, విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై చెట్టు కూలడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దక్షిణ ఛత్తీస్గఢ్ అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.