కూరతతో ఎనిమిది జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
రిపోర్టర్: సతీష్
స్థలం: ఒడిశా
ఒడిశా రాష్ట్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నబరంగపూర్, పూరి, జగత్‌సింగ్‌పూర్, గంజామ్, గజపతి, కొరాపుట్, ఖుర్దా, మల్కాన్‌గిరి జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు మరియు అంగన్‌వాడీ కేంద్రాలకు సెప్టెంబర్ 24న సెలవు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఉపాధ్యాయులు, సిబ్బంది యథావిధిగా విధులకు హాజరు కావాలని స్పష్టం చేశారు.