దిల్లీలో ముగిసిన జాతీయ బాలల సాంస్కృతిక సదస్సు వేడుకలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: గరివిడి
జాతీయ బాలభవన్ ఆధ్వర్యంలో దిల్లీలో మూడు రోజులపాటు నిర్వహించిన జాతీయ బాలల సాంస్కృతిక సదస్సు ముగింపు వేడుకలు సోమవారం ఘనంగా ముగిశాయని నిర్వాహకులు తెలిపారు. రాజాం బాలభవన్ తరఫున శిక్షణ పొందిన గరివిడి, చీపురుపల్లి బాలికలు వందేమాతరం గీతానికి చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా వివిధ రాష్ట్రాల విద్యార్థులతో కలిసి నూతన విషయాలు నేర్చుకునే అవకాశం దక్కిందని బాలభవన్ నిర్వాహకుడు సుంకరి రమేష్ వెల్లడించారు.