మహిళా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పురుష నేతలు నెట్టేశారు: మంత్రి సీతక్క

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద జరిగిన నిరసనల్లో సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ పురుష నేతలు అమర్యాదగా ప్రవర్తించారని మంత్రి సీతక్క తీవ్ర ఆరోపణలు చేశారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మిలను గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి వెనుక నుంచి బలంగా నెట్టేశారని ఆమె మండిపడ్డారు. తోటి మహిళా నేతలను పక్కకు తోసేసి ముందుకు వెళ్లడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.