కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ కేసీఆర్ అన్న కుమార్తె రమ్యా రావు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

తమ తండ్రి జమిందారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ అన్న కుమార్తె రమ్యా రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వివాహాల సమయంలో తమ కుటుంబాల వద్ద కనీసం పది ఎకరాల భూమి కూడా లేదని, కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల సంపద ఎక్కడి నుంచి వచ్చిందని ఆమె సూటిగా ప్రశ్నించారు. అలాగే మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఆయన అక్రమ ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.