టీటీడీ వెబ్సైట్లో గదుల బుకింగ్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Tirupati
టీటీడీ అధికారిక వెబ్సైట్లో శ్రీవారి దర్శన గదుల బుకింగ్ ప్రక్రియను కృత్రిమ మేధస్సు టెక్నాలజీతో విజయవంతంగా నిర్వహించినట్లు టెక్ క్రియేటర్ పవన్ తెలిపారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన పంచుకున్న వివరాల ప్రకారం, డిసెంబర్ 21వ తేదీకి సంబంధించిన వసతి గదిని బుక్ చేసుకునేందుకు జీపీటీ సిక్స్ అస్త్ర ఏఐ టూల్‌కు ఆదేశాలు ఇవ్వగా, అది లాగిన్ వివరాలను సేకరించి చెల్లింపు పేజీ వరకు ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా పూర్తి చేసిందని వెల్లడించారు.