కోళ్ల ఫారాల ఈగల బెడదతో చితికిపోతున్న పశువుల బతుకులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మునగపాక

చెర్లోపాలెం పంచాయతీ పరిధిలోని కోళ్ల ఫారాల వల్ల రైతులు, పశువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వైస్ ఎంపీపీ బోజా వెంకట శ్రీనివాసరావు ఆరోపించారు. ఫారాల చుట్టూ ఈగలు, దోమలు విపరీతంగా వృద్ధి చెందడంతో మూగజీవాలు అనారోగ్యానికి గురవుతున్నాయన్నారు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి స్పందన లేదని తెలిపారు. మేతకు వచ్చే పశువులను ఫారానికి చెందిన సిబ్బంది కర్రలతో బెదిరించి తరిమేస్తున్నారని, అధికారులు తక్షణమే స్పందించి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.