మెగాస్టార్ 'కాకా' చిత్రంలో అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ విడుదల

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న ‘కాకా’ చిత్రం నుంచి నటి అనస్వర రాజన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె ‘అమ్ములు పాప’ అనే మెడికల్ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నారు. పోస్టర్‌లో ఆమె వెనుక చిరంజీవి సత్యం పాత్ర సిల్హౌట్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ 2027 జనవరి 13న విడుదల కానుంది.