టాలీవుడ్ హీరో తేజ సజ్జా వివాహంపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోందని సినీ వర్గాలు వెల్లడించాయి. పెద్దలు కుదిర్చిన ఈ వివాహం డిసెంబర్లో జరగనుందని వార్తలు వస్తున్నప్పటికీ, ఇప్పటివరకు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో ఓ ఈవెంట్లో ఈ ప్రచారంపై తేజ సజ్జా స్పందిస్తూ తాను పెళ్లిపై ఎలాంటి ప్రకటన చేయలేదని తేల్చిచెప్పారు.