మణుగూరులో పరవళ్లు తొక్కుతున్న సుందర వెన్నెల జలపాతం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే వెన్నెల జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వర్షాభావంతో కళ తప్పిన ఈ జలపాతానికి రెండ్రోజులుగా కురుస్తున్న ఏకధాటి వర్షాలతో మళ్లీ జీవం పోసుకుంది. రథంగుట్టపై నుంచి నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రకృతి ప్రేమికులు భారీగా తరలివస్తున్నారు. జలపాత సౌందర్యాన్ని తిలకించేందుకు యువత, మహిళలు, చిన్నారులు పెద్దఎత్తున క్యూ కడుతున్నట్లు స్థానికులు తెలిపారు.