'సహజీవనం రక్తపాతం..': విజయనగరంలో ప్రియుడిని హతమార్చిన మహిళ
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటలో తీవ్ర కలకలం రేపిన హత్య ఘటనలో దనాల రాములమ్మ తన సహజీవన భాగస్వామి శ్రీనును హతమార్చింది. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదం కారణంగా గురువారం తెల్లవారుజామున జరిగిన ఘర్షణలో రాములమ్మ ఇనుపరాడ్డుతో శ్రీను తలపై బాది, యాసిడ్ పోయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఆమె కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చీపురుపల్లి సీఐ శంకరరావు, ఎస్సై లోకేశ్వరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.