రాయలసీమ వజ్రాల వేట నేపథ్యంలో జో జో సినిమా గ్లింప్స్ విడుదల
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
కృష్ణకమల్, మహి జంటగా నటిస్తున్న రస్టిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ జో జో చిత్ర గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారని చిత్ర యూనిట్ తెలిపింది. రాయలసీమ జొన్నగిరి గ్రామంలో వర్షాలు పడినప్పుడు వజ్రాలు దొరికే ప్రాంతం నేపథ్యంలో ప్రేమ, భావోద్వేగాలతో ఈ సినిమా సాగుతుందని దర్శకుడు కిరణ్ జయకుమార్ పేర్కొన్నారు. విజయ్‌కృష్ణ లింగమనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయని వారు స్పష్టం చేశారు.