నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించి ఆదుకున్న సీఎం చంద్రబాబు

రిపోర్టర్: సతీష్ స్థలం: శ్రీకాకుళం

దశాబ్దాలుగా సొంత ఇంట్లోనే పరాయి వారిలా భయంతో బతుకుతున్న నిరుపేదల కలను సీఎం చంద్రబాబు నాయుడు సాకారం చేశారని బెందాళం అశోక్ శ్రీకాకుళం పేర్కొన్నారు. వేల కోట్ల విలువ చేసే ఆస్తులపై సర్వహక్కులు కల్పిస్తూ పట్టాలు అందజేయడం ద్వారా సుమారు ఇరవై నాలుగు వేల కుటుంబాలలో ఆనందం నింపారని ఆయన వెల్లడించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు శాశ్వత భద్రత చేకూరుతుందని, ఇది నిజమైన ప్రజా సంక్షేమ పాలనకు నిదర్శనమని ప్రశంసించారు.