సోషల్ మీడియా సంచలనం: జార్జియాలో ఆరు ఇళ్లను కొనుగోలు చేసిన ఏఎంపీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: Georgia

అమెరికాలో ప్రసిద్ధ కంటెంట్ క్రియేటర్ల బృందం ఏఎంపీ సంస్థ జార్జియాలో తాజాగా ఆరు ఇళ్లను కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో ఫేనమ్ వెల్లడించారు. కై సెనాట్ నేతృత్వంలోని ఈ బృందం సభ్యులు, వారి మిత్రులు కలిసి జీవించడానికి, వీడియోలు రూపొందించడానికి ఈ ప్రాపర్టీలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాన్ని వారు ది హిల్ అని పిలుస్తున్నారని పేర్కొంటూ, తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతోందని వెల్లడించారు.