ఇస్రో మరో విజయం: నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్-18 రాకెట్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: శ్రీహరికోట
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్-18 రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా ఎన్వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపించినట్లు అధికారులు తెలిపారు. స్వదేశీ నావిక్ సేవలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టామని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ ప్రకటించారు. ఈ ఉపగ్రహం కక్ష్యలో పదమూడేళ్ల పాటు సేవలు అందిస్తుందని పేర్కొన్నారు.