స్పీకర్‌పై వ్యాఖ్యల వివాదం: క్షమాపణ కోరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు

రిపోర్టర్: సునీల్ స్థలం: తెలంగాణ

తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ప్రచారంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తీవ్రంగా స్పందించారు. తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడలేదని స్పష్టం చేశారు. అయితే తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే వాటిని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ స్థానం పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందని వెల్లడించారు.