ఉప్పు ధరల పతనంతో తీవ్ర నష్టాల్లో రైతులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: సొల్లూరు

అల్లూరు తీర ప్రాంతంలో ఉప్పు ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. గత నెలలో క్వింటాల్ రూ.250 ఉండగా, ప్రస్తుతం రూ.120కి పడిపోయింది. పెట్టుబడి కూడా రాకపోవడంతో సుమారు నాలుగు వేల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం, వర్షాల భయంతో రైతులు అప్పులపాలవుతున్నారు.