అమెరికా నుంచి మాజీ ఐపీఎస్ బాలసుబ్రమణ్యం భౌతికకాయం తరలింపు పూర్తి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

అమెరికాలో కన్నుమూసిన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎన్.బాలసుబ్రమణ్యం భౌతికకాయాన్ని కేవలం పదహారు గంటల వ్యవధిలోనే భారత్ కు తరలించేందుకు అవసరమైన అన్ని అనుమతులు, పత్రాలు పూర్తి చేసినట్లు ప్రవాసాంధ్రుడు కొల్లా అశోక్ వెల్లడించారు. సాధారణంగా ఒక అనుమతి వచ్చాకే మరో దానికి దరఖాస్తు చేసే విధానానికి భిన్నంగా అన్ని విభాగాల అనుమతులను ఒకే సమయంలో కోరడం వల్ల సమయం కలిసొచ్చిందని ఆయన తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భౌతికకాయాన్ని హైదరాబాద్ కు పంపించినట్లు ఆయన వివరించారు.