రాష్ట్రంలో ముగిసిన ఎంపీటీసీ జడ్పీటీసీ నామినేషన్ల ఘట్టం: భారీగా దాఖలు చేసిన అభ్యర్థులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: Amaravati

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఆరు వందల యాభై తొమ్మిది జడ్పీటీసీ స్థానాలు, తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు ఇవాళ సాయంత్రం ఐదు గంటలతో నామినేషన్ల గడువు ముగిసింది. పలు ప్రాంతాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలంగా నామపత్రాలు సమర్పించారు. ఈనెల ఇరవై ఐదవ తేదీన నామినేషన్ల పరిశీలన మరియు తుది జాబితా ప్రకటన ఉంటుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.