ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల: నవంబర్ 1న పోలింగ్
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం సవరించిన నూతన షెడ్యూల్‌ను విడుదల చేసిందని అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 28న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసినట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది. నామినేషన్ల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న అభ్యర్థులకు అక్టోబర్ 23, 24 తేదీలలో మరోసారి నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు వెల్లడించారు.