మహేష్ బాబుతో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ భన్సాలీ భారీ ప్రాజెక్ట్?

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ భేటీ అయినట్లు ఫిల్మ్‌నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌లో ఒక గ్రాండ్ పీరియాడికల్, హిస్టారికల్ కథాంశంతో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత ఈ సంచలన కలయికపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.