శ్రీకాకుళంలో విద్యార్థినులతో కలిసి కేంద్రమంత్రి, ఎమ్మెల్యే శ్రమదానం

రిపోర్టర్: రాము స్థలం: శ్రీకాకుళం

స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం మహిళా కళాశాల ప్రాంగణంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రమదానం చేశారు. పరిశుభ్రమైన, సుందర శ్రీకాకుళం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, స్థానిక నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.