రాప్తాడు ఘటన: పోలీసుల కాల్పులపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యార్థినిపై దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్ పై పోలీసులు జరిపిన కాల్పులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది అని న్యాయవర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై దాఖలైన పిటిషన్ ను విచారించిన ఉన్నత న్యాయస్థానం, పూర్తి వివరాలతో కూడిన స్టేటస్ రిపోర్ట్ ను సమర్పించాలని పోలీసు శాఖను ఆదేశించింది. బాధితురాలైన బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ధర్మాసనం, నిందితుడి తరఫు న్యాయవాది వాదనలను కూడా విన్నది.