కాశీ నుంచి వస్తున్న రైలులో కత్తులతో ప్రయాణికులపై దొంగల దాడి
రిపోర్టర్: రాము
స్థలం: టెనాలి
కాశీ నుంచి రైలులో తిరిగి వస్తున్న తెనాలి యాత్రికులను మధ్యప్రదేశ్లో ముసుగు దొంగలు కత్తులతో బెదిరించి భారీగా నగలు, నగదు దోచుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కట్నీ జంక్షన్ సమీపంలో సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలు ఆపి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపారు. ఆ సమయంలో రైలులో ఆర్పీఎఫ్ సిబ్బంది గానీ, టీసీలు గానీ లేకపోవడం, జమల్పూర్ పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై యాత్రికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను కోరారు.