అమెరికాలో భారతీయ యూట్యూబర్కు చేదు అనుభవం జాతి వివక్ష

రిపోర్టర్: అశోక్ స్థలం: Las Vegas

అమెరికా పర్యటనలో ఉన్న భారతీయ యూట్యూబర్ పరమ్వీర్ సింగ్ బెనివాల్కు లాస్ వెగాస్లో చేదు అనుభవం ఎదురైంది. తాను వీడియో తీస్తుండగా కొందరు వ్యక్తులు తన వద్దకు వచ్చి జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశారని, స్టోర్లలో పనిచేయాలంటూ అవమానించేలా మాట్లాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను వెంటనే స్పందించి వారికి దీటుగా బదులిచ్చానని, ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తనకు మద్దతుగా నిలుస్తున్నారని ఆయన వెల్లడించారు.